ఇంధన పొదుపుకు ఎమ్మెల్యే నల్లమిల్లి వినూత్న ఆలోచన
- ఎలక్ట్రిక్ బైక్‌పై కొమరిపాలెంలో అభివృద్ధి పనుల పరిశీలన పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 15: తూర్పు గోదావరిజిల్లా అనపర్తి:ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి వినూత్నంగా ముందుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ “నో వెహికల్ డే” సందర్భంగా కాన్వాయ్‌ను వదిలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌పై కొమరిపాలెం గ్రామానికి వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ...