ప్లస్పాడు కలసపాడు ఆగస్టు 22 పొలిటికల్ పవర్ పిన్ 9 tv సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎo. ప్రసాద్ రావు. కలసపాడు కడప జిల్లా. కలసపాడు మండలంలోనిదళితవాడలో మౌలిక వసతుల కోసం కూటమి ప్రభుత్వం భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు ఏర్పాటు కోసం ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కలసపాడు మండల ప్రధాన కార్యదర్శి కారు లాజరస్ తెలిపారు.శనివారం ఉదయం కలసపాడు పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈనెల 24 తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక శంఖారావంలో వచ్చిన దళితపేటలోని సమస్యల పైన ధర్నా నిర్వహిస్తున్నట్లు కరపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కలసపాడు మండల ప్రధాన కార్యదర్శి కారు లాజరస్ ,మండల అధ్యక్షుడు కారు ఎజ్రా, మండల ఉపాధ్యక్షులు గుడిమే సుదర్శన్, కారు నతనల్ బాబు, మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి నిరుపేదలు భూ పంపిణీ నోచుకోలేదు ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్న పేదవాడికి ఒక సెంటు భూపంపిణీ పాలకవర్గాలు అమలు చేయలేదన్నారు.ఉన్న భూములన్ని అన్యక్రాంతమై స్థానిక పేదలకు సెంటు లేకుండా పేదలను వలసలు వెళ్ళేటట్లు ప్రభుత్వం అధికారులు రాజకీయ నాయకులు చేస్తున్నారు అన్నారు.
ఉపాధి హామీ చట్టం పనులు పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. పేదలకు కాలనీలో వీధిలైట్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు కల్పించాలని జగనన్న కాలనీలోనూ పూర్తి చేయాలని మూసివేసిన ప్రాథమిక పాఠశాలలు పునర్దించాలని కోరారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పునర్దించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగం సవరణ చేయాలన్న
కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 ఇస్తామని ఎన్నికల్లో హామీ అమలు చేయాలన్నారు.డప్పు కళాకారులకు వితంతు వికలాంగులు వృద్ధాప్య తదితర పింఛన్లు అమలు చేయాలని అన్నారు గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. చేతివృత్తిదారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. పై డిమాండ్లపై ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కారు లాజరస్ మండల అధ్యక్షులు కారు ఎజ్రా, ఉపాధ్యక్షులు గుడిమే సుదర్శన్, కారు నతనియల్ బాబు, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు, షేక్ హుస్సేన్ పీరా, తదితరులు పాల్గొన్నారు.