POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 11:27 pm Posted by : POLITICAL POWER

ఈనెల 24న భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు స్థలాల కోసం.

 

జిల్లా కలెక్టరేట్ జరిగే ధర్నాను జయప్రదం చేయండి.

కలసపాడు ఆగస్టు 22 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. జాతీయ సమగ్ర తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా.
దళితవాడలో మౌలిక వసతుల కోసం కూటమి ప్రభుత్వం భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు ఏర్పాటు కోసం ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ పిలుపునిచ్చారు.
కాశినాయన మండలం ఇటుకలపాడు, ఆకుల నారాయణ పల్లె, గ్రామలలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు కరపత్రాలు విడుదల చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి నిరుపేదలు భూ పంపిణీ నోచుకోలేదు ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్న పేదవాడికి ఒక సెంటు భూపంపిణీ పాలకవర్గాలు అమలు చేయలేదన్నారు.ఉన్న భూములన్ని అన్యక్రాంతమై స్థానిక పేదలకు సెంటు లేకుండా పేదలను వలసలు వెళ్ళేటట్లు ప్రభుత్వం అధికారులు రాజకీయ నాయకులు చేస్తున్నారు అన్నారు.
ఉపాధి హామీ చట్టం పనులు పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు.పేదలకు కాలనీలో వీధిలైట్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు కల్పించాలని జగనన్న కాలనీలోనూ పూర్తి చేయాలని మూసివేసిన ప్రాథమిక పాఠశాలలు పునర్దించాలని కోరారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పునర్దించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగం సవరణచేయాలన్నారు.కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 ఇస్తామని ఎన్నికల్లో హామీ అమలుచేయాలన్నారు.డప్పు కళాకారులకు వితంతు వికలాంగులు వృద్ధాప్య తదితర పింఛన్లు అమలు చేయాలఅన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. చేతివృత్తిదారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. పై డిమాండ్లపై ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం ఆకుల నారాయణ పల్లె గ్రామం నాయకులు తిరువీధి సుబ్బారావు, తులసిరామయ్య, రామకృష్ణ , ఇటుకలపాడు గ్రామ నాయకులు వెంకటసుబ్బయ్య వెంకటరెడ్డి, గుర్రప్పడు, ముర్తయ్య, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు