POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:53 pm Posted by : POLITICAL POWER

ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: వనపర్తి పట్టణం రాజీవ్ చౌరస్తాలో గల షిరిడి సాయి కాంప్లెక్స్లో ఆంజనేయులు ఏర్పాటు చేసుకున్న శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ వ్యాపార సముదాయాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఫోటోలు వీడియోలకు సంబంధించి ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని ఆ మార్పులకు అనుగుణంగానే మనం ముందుకెళ్లలన్నారు. ఇలాంటి ఈవెంట్స్ చేసే విభాగాలు ఏర్పాటు చేయడం ద్వారా పెళ్లిళ్లు పేరంటాలతో పాటు ఇతరత్రా శుభకార్యాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఆంజనేయులును ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.