POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:22 pm Posted by : POLITICAL POWER

ఈ నెల 13 నుంచి నిమ్స్ లో ఉచిత హార్ట్ సర్జరీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026: హైదరాబాద్ లోని నిమ్స్ ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ముందుగా వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. తర్వాత అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. పాత టెస్ట్ రిపోర్టులతో సోమ-శనివారాల్లో 8AM-2PM మధ్య నిమ్స్ పాత బ్లాక్లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఐదేళ్లుగా ఉచిత సర్జరీలు చేస్తున్నామన్నారు..