చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచన
బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో సమన్వయ సమావేశం
పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఈ నెల 18న సత్తుపల్లి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసిం సాహెబ్ తెలిపారు. ఈరోజు బుధవారం బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను (యు/సెక్షన్ 138 ఎన్‌ఐ యాక్ట్) పరస్పర రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసిం సాహెబ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.ఎస్.ఎన్. సుమబాల, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. లావణ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. రవి, సీనియర్ న్యాయవాదులు నల్లగట్ల విజయ్ కుమార్, బి. వెంకట్రావు, వివిధ బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.