POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 1:33 pm Posted by : POLITICAL POWER

ఈ నెల11న కుమ్మర ఇంటి ఆడపడుచు మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపన

 ఎమ్మెల్యే. తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా భూమి పూజకు కార్యాచరణ సిద్ధం, భూమి పూజకు కుమ్మరులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08.2026.ఈ నెల (నవంబర్) 11వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే మన కుమ్మర ఇంటి ఆడపడుచు, మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా భూమి పూజకు కుమ్మరులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే. తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 11న జరిగే మొల్ల విగ్రహ భూమి పూజకు జిల్లాలోని కుమ్మరులు పెద్ద ఎత్తున తరలిరావాలనికోరుతూశనివారంకొత్తకోట,మదనపురం, ఆత్మకూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు సత్యం,మండల గౌరవ అద్యక్షుడు డాక్టర్ నరేష్, యువజన సంఘం అధ్యక్షులు మేఘశ్యామ్, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, యువజన సంఘం అధ్యక్షులు ఈశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మన కుల ఐక్యతకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఈ నెల 11న వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే కవయిత్రి మొల్ల మాంబ విగ్రహ భూమిపూజకుజిల్లాలోనికుమ్మరులు,బంధుమిత్రులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై, మన కుల ఐక్యతను, సంఘటిత శక్తిని చాటి చెప్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పరుశురాం, సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు బొంబాయి మన్యం కొండన్న, మన్యం, తిరుపయ్య, రవి, నర్సింహా, వాసు, శ్రీరాజ్ తదితరులు పాల్గొన్నారు.