ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర… శత్రుచర్ల విజయరామరాజు! ఒక రాజకీయ ప్రస్థానం.. ఎన్నో పదవులు.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం!

పొలిటికల్ పవర్   విజయనగరం ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కొన్ని వ్యక్తిత్వాలు కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా ఒక ప్రత్యేక రాజకీయ అధ్యాయంగా నిలిచిపోతాయి. అలాంటి నాయకుల్లో శత్రుచర్ల విజయరామరాజు ఒకరు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన రాజకీయ ప్రస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. రాజకీయమే ప్రస్థానంగా.. ప్రజాసేవే లక్ష్యంగా! 1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు కురుపాం ప్రాంత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1978లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ...