ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ శివయ్య
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు, కడప జిల్లా బ్యూరో వెంకటేశ్వర్లు: బ్రహ్మంగారిమఠం మండలంలో పంచాయతీ సెక్రెటరీ పూజ శివయ్య తన విధి నిర్వహణలో భాగంగా వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటలకే పోలేరమ్మ నగర్‌లోని వృద్ధుల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టి పింఛన్ తీసుకోవాలని తెలియజేస్తూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధులు ఇబ్బందులు పడకుండా వారికి సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్న పంచాయతీ సెక్రెటరీ...