రోజు రోజుకు ఎదురు చూపులే.
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్ల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయబద్దంగా రావలసిన పి ఆర్ సి మరియు పెండింగ్ ఉన్న 5 డి ఏ లు తక్షణమే ప్రకటించాలని. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల. పెన్షనర్ల ఆరోగ్య హెల్త్ కార్డులు ఇచ్చి వెంటనే అన్ని కార్పొరేట్ హాస్పటల్స్ లల్లో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సి ఎం చొరవ తీసుకొని ఉద్యోగుల సమస్యలు అన్ని తీర్చాలని. ఎన్ని సార్లు సమావేశాలు ఏర్పాటు చేసారు కానీ ముఖ్యమైన సమస్యలు ఏ ఒక్కటి ముందుకు సాగటం లేదని ఎదురు చూస్తున్న ఉద్యోగులు 2013 నుండి రావలసిన పి ఆర్ సి. ఆలస్యం అవటం వల్ల. పెరిగిన ధరలకు అనుగుణంగా డి ఏ లు ఇవ్వకుండా ఉంటే ప్రతీ ఉద్యోగి కి ఎంతో నష్టం వస్తుంది. ఉద్యోగ విరమణ లో చేసిన వారికీ కూడా సకాలం లో డబ్బులు అందక. ఎన్నో ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని. ఉద్యోగుల న్యాయమైన హక్కు. డి ఏ లు పి ఆర్ సి. వెంటనే ఇవ్వాలని,హెల్త్ కార్డులు కూడా వెంటనేఇవ్వాలని ఉద్యోగి కి విరమణ అయిన రోజునే ఉద్యోగుల ప్రయోజనాలు అన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్. ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన నాగరాజు