POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 8:15 am Posted by : POLITICAL POWER

ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాయికంటి రాములు యాదవ్ నియామకం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 24 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ ఉపసర్పంచ్ రాయికంటి రాములు యాదవ్ ను వనపర్తి జిల్లా ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాయికంటి రాములు యాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, గ్రామ పెద్దలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాయికంటి రాములు యాదవ్ మాట్లాడుతూ… తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు.