ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: వనపర్తి టౌన్ ఎంపీపీ పాఠశాల శ్రీనివాస్ పూర్ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉమ్మల రాములు అధ్వర్యములో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ హాజరయ్యారు. ముందుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు శంభావి...