POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 7:03 pm Posted by : POLITICAL POWER

ఉప్పల్ బగాయత్ భూ పోరాటాన్ని జయప్రదం చేయాలి

టీఆర్ఎస్ పార్టీ ఎదురుగట్ల సంపత్ గౌడ్, దామోదర్ గౌడ్ పిలుపు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23 2026: జులై 2న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని భూ పోరాట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ దామోదర్ గౌడ్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన జర్నలిస్టులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరుల కుటుంబాలకు హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో 250 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులను కమిటీలో చేర్చడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా సీనియర్ నాయకులు దాసరి విజయ్ ముదిరాజ్, ఎం.కే. నిజాం, శ్యామ్, కరాటే శ్రీను, మోహన్‌తో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.