POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 5:08 pm Posted by : POLITICAL POWER

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం ఘన విజయం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 06 2026: ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేష్ ఆధ్వర్యం వహించారు. సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దపల్లి కిషన్‌రావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ భూమేష్, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సరోజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, నాయకులు సింగం నగేష్, లింగన్న తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి వందలాది మంది ఉద్యమకారులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం, 250 గజాల ఇంటి స్థలం, నాలుగు గదుల ఇల్లు, నెలకు రూ.50 వేల పెన్షన్, వారి పిల్లలకు ఉచిత విద్య, కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం, ఉచిత రవాణా, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి సంవత్సరం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఘనంగా సన్మానించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యమకారులందరికీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.