ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల సేవలు చిరస్మరణీయం: అభిమానులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన అభిమానులు పేర్కొన్నారు. దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు చేరవేసి సాగునీటి రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నాయకుడిగా తుమ్మలను అభివర్ణించారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు...