…రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 13 2026: వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్ల నిధులతో 171.96 కి.మీ. ల ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పాలమూరు ఇక వెనుకబడిన జిల్లా కాదని అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగంగా రూ.359.09 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ (హైబ్రిడ్ అన్యుటీ మోడల్) ప్రాజెక్టు రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సహచర మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై సోమవారం శంకుస్థాపన చేశారు. వీరితోపాటు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఉన్నారు.
ఈ హైబ్రిడ్ అన్యుటీ మోడల్ ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో రోడ్లు నిర్మిస్తుంది. హైబ్రిడ్ అన్యుటీ మోడల్ ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఆర్థిక భారాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తయ్యే అవకాశం పెరుగుతుంది. ఇందులో భాగంగా ఆత్మకూరు రోడ్డు కి.మీ 27/0 నుండి 31/7 వరకు పటిష్ఠ పరచుట 4.70 కి.మీ.6.04 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలోని మాధారం నుండి మార్చాల రోడ్డు కి.మీ 0/0 నుండి 12/0 వరకు రెండు లేన్లకు వెడల్పు చేయుట 12.00 కి.మీ.32.96 కోట్లు, వనపర్తి జిల్లాలోని పెద్ద దగడ రోడ్డు నుండి వెలగొండ రోడ్డు (వయా గూడెం, బెక్కెం & మియాపూర్ రోడ్డు కి.మీ 0/0 నుండి 16/6 వరకు రెండు లేన్లకు వెడల్పు చేయుట 16.60 కి.మీ. 45.60 కోట్లు, వెరసి జిల్లాలో 171.96 కి.మీ పొడవు హ్యామ్ రోడ్డు పనులకు రూ. 369.09 కోట్ల అంచనా విలువ గల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిస్థాయిలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.3,000 కోట్ల నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కురుమూర్తి స్వామి దేవాలయానికి అద్భుతమైన రహదారులను మంజూరు చేశామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2028 నాటికి అద్దంలాంటి రహదారులను నిర్మిస్తామని పేర్కొన్నారు. పాలమూరు ఇక వెనుకబడిన జిల్లా కాదని, రహదారులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో రూ.359.09 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల అమలును ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో రూ.359.09 కోట్ల రహదారి అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. వనపర్తికి ఐటీ టవర్, రూ.275 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని, మరో రూ.124 కోట్లను మంజూరు చేస్తే వనపర్తిలోని అన్ని ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆనాడు తమ పదవులను త్యాగం చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వం 2034 వరకు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రూ.359.09 కోట్ల హ్యామ్ ప్రాజెక్టు రహదారి పనులకు శంకుస్థాపన చేశామని, కురుమూర్తి స్వామి ఆలయ రహదారుల అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో హ్యామ్ ప్రాజెక్టు ద్వారా రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.