POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 11:05 pm Posted by : POLITICAL POWER

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.

రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన యువకుడు మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామం డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన కట్టు రాహుల్ (28) అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.