POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:28 pm Posted by : POLITICAL POWER

*ఎండల వేళ ప్రజలకు అండగా వైయస్‌ఆర్‌సీపీ సేవా కార్యక్రమాలు*

 

– పీరా రామచంద్రపురంలో 1000 టాటా గ్లూకోస్ గ్లాసుల పంపిణీ

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15:
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి:
తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించే లక్ష్యంతో అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో స్థానిక వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద గురువారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి బాటసారులు, గ్రామ ప్రజలకు సుమారు 1000 టాటా గ్లూకోస్ గ్లాసులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో స్థానిక పార్టీ నాయకులు సుమారు రూ.2 లక్షల వ్యయంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఏప్రిల్ 20 నుంచి మే 31 వరకు కొనసాగనున్న ఈ చలివేంద్రంలో ప్రతిరోజూ మజ్జిగతో పాటు నిమ్మరసం, ద్రాక్షరసం, బత్తాయి రసం, బెల్లం పానకం వంటి శీతల పానీయాలు, బొప్పాయి ముక్కలను ప్రజలకు అందిస్తూ దాహార్తిని తీర్చుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేకంగా 1000 టాటా గ్లూకోస్ గ్లాసులను పంపిణీ చేసినట్లు చెప్పారు.
సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదిలక్ష్మి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోణాల వెంకట సాయిరామరెడ్డి, తమలంపూడి సత్యనారాయణ రెడ్డి, తమలంపూడి రాజేంద్ర రెడ్డి, తాడి సీతారామరెడ్డి, తాడి సుధాకర్ రెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, పడాల దొరరెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి, చిర్ల బస్విరెడ్డి, కర్రి గోవింద్ రెడ్డి, చిర్ల సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి వినయ్ కుమార్ రెడ్డి, తమలంపూడి శ్రీధర్ రెడ్డి, నల్లమిల్లి వీర్రెడ్డి, నల్లమిల్లి చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.