Date of Publish : 11 September 2026, 6:04 pmPosted by : POLITICAL POWER
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అర్హత కలిగిన అందరూ దరకాస్తూ చేసుకోవచ్చు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అర్హత కలిగిన అందరూ దరఖాస్తు చేసుకో వచ్చు… కలసపాడు సెప్టెంబర్ 10 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులను ద అర్హత కలిగిన వారు వారి వారి సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహబూబ్ బీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని అన్ని ప్రాంతాలలో సర్వర్ చక్కగా పనిచేస్తే అనుకున్న సమయానికి దరఖాస్తులు పూర్తి విచ్చేసి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అయితే ప్రస్తుతం మండలంలో సర్వర్ ప్రాబ్లం వల్ల రోజుకు పది నుండి 15 దరఖాస్తులు చేస్తున్నారని ఆమె తెలిపారు. కావున ప్రజలు తొందరపాటు పడకుండా ఓపికతో సచివాలయ సిబ్బందికి సహకరించి నమోదు చేసుకుని వెళ్లవలసిందిగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాచెరువు ఆయకట్టు ప్రెసిడెంట్ . పామూరి బాల్రెడ్డి . మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రహల్లాద రెడ్డి ఈ తంబళ్లపల్లి గ్రామపంచాయతీ తెలుగు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.