Date of Publish : 22 September 2026, 7:39 pmPosted by : POLITICAL POWER
ఎన్నికలు మనకేం కొత్త కాదు.. ఫైట్ చేయడం మనకేం కొత్త కాదు
ప్రజల గుండెల్లో ఉన్నాం.. ఖచ్చితంగా గెలిచి మన సత్తా చూపిస్తాం: దానం నాగేందర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 22 2026: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, దానం నాగేందర్ ను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఎన్నికలు తమకు కొత్తేమీ కాదని, పోరాటం చేయడం కూడా కొత్త కాదని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నామని, ప్రజల గుండెల్లో తమకు స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నారని, రానున్న రోజుల్లో ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడి ఖచ్చితంగా విజయం సాధించి తమ సత్తా ఏంటో చూపిస్తామని దానం నాగేందర్ అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు దయ్యాల దాసు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు నాగేష్, సాగర్, గద్దల ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.