POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 7:54 am Posted by : POLITICAL POWER

ఎన్నికల అవగాహన పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థుల విజయభేరి!

వ్యాసరచనలో జీషన్‌కు ద్వితీయ స్థానం.. క్విజ్‌లో సహస్రకు తృతీయ స్థానం

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రిన్సిపల్, అధ్యాపకుల అభినందనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: విద్యతో పాటు విజ్ఞానం.. పోటీల్లో ప్రతిభతో విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో బహుమతులు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఈ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎండీ జీషన్ (CEC ప్రథమ సంవత్సరం) వ్యాసరచనలో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ కనబరిచారు. అలాగే డి. సహస్ర (MPC ప్రథమ సంవత్సరం) క్విజ్ పోటీల్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.

విజయాల వెనుక విద్యార్థుల కృషి.. కళాశాల ప్రోత్సాహం!

విద్యార్థులు సాధించిన విజయాలపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఏ. అనిత, స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్.కే. సాహెదతో పాటు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీల్లో బహుమతులు సాధించడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలపై అవగాహనతో విద్యార్థులు ముందుకు సాగడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.