POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:38 pm Posted by : POLITICAL POWER

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్ శర్మ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా నూతనంగా నియమితులైన నాయకులు బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా గాజుల కుమారస్వామి, మహబూబాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా చెవుగాని మహేష్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ సలహాదారు రాజులపాటి ఐలయ్య ఆధ్వర్యం వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా యువజన అధ్యక్షులకు మద్దిశెట్టి సామేలు అభినందనలు తెలిపారు. జిల్లాల్లో పార్టీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను ప్రజా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని నూతన అధ్యక్షులకు సూచించారు. యువతకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నూతనంగా నియమితులైన నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఊకే ఎంకన్న, కిన్నెర రామకృష్ణ, పలగాని శ్రీనివాస్ గౌడ్, సూర్య సీతారాములు, కారం చంద్రయ్య, నర్సంపేట ఇన్‌చార్జ్ మోహన్, పోతులూరి చారి, ఇస్త్రాంకుమార్, మామిళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.