ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం
పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్ శర్మ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా నూతనంగా నియమితులైన నాయకులు బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా గాజుల కుమారస్వామి, మహబూబాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా చెవుగాని మహేష్...