Date of Publish : 25 September 2026, 6:54 pmPosted by : POLITICAL POWER
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల హక్కుల కోసం చలో కమిషనరేట్
హైదరాబాద్‌లో ఈ నెల 28న ఎన్ హెచ్ ఎం -జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్ హెచ్ ఎం-జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట చలో కమిషనరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కర్ నాయక్ ను కలిసి అనుమతి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఎన్ హెచ్ ఎం -జెఏసి నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన ఎన్ హెచ్ ఎం సిబ్బంది హైదరాబాద్ చలో కమిషనరేట్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.