POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 8:07 pm Posted by : POLITICAL POWER

ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన కిడ్నీ శస్త్రచికిత్స విజయవంతం

ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కె. కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైన ఆపరేషన్ – రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 13 2026: ఖమ్మం నగరంలోని నరసింహస్వామి టెంపుల్ రోడ్, బాలాజీ నగర్‌లో ఉన్న ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన కిడ్నీ శస్త్రచికిత్సను ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కె. కిషోర్ కుమార్ రెడ్డి (ఎం.ఎస్., ఎం.సి.హెచ్.) విజయవంతంగా నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం, జీలుగుమిల్లి గ్రామానికి చెందిన మైలవరపు విజ్జేశ్వరి (30) భర్త మురళి గత 8–10 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10న ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్ కె. కిషోర్ కుమార్ రెడ్డిని సంప్రదించగా, అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆమెకు అరుదైన కిడ్నీ వ్యాధితో పాటు కిడ్నీలో పెద్ద రాయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, జూలై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ ద్వారా కిడ్నీలో ఉన్న సుమారు 800 గ్రాముల బరువున్న రాయిని విజయవంతంగా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందంలోని డాక్టర్ ముకుంద్ వర్మా (న్యూరాలజిస్ట్), డాక్టర్ ఆర్. లలిత (గైనకాలజిస్ట్), డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), డాక్టర్ రాకేష్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ శివరామ్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్) తదితరులు పాల్గొని రోగికి సమగ్ర వైద్య సేవలు అందించారు.