పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ చెంగల గురునాథం మాదిగ అధ్యక్షతన నూతన మండల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేoగల గురునాథం మాదిగ మాట్లాడుతూ… జూలూరుపాడు మండలంలో ఏడు మాదిగ గ్రామాలు ఉన్నాయని, ఏడు గ్రామాల గ్రామ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీల ఏకగ్రీవ తీర్మానం మేరకు దిబ్బెందల సాయికుమార్ మాదిగ ని జూలూరుపాడు మండల ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మాదిగల హక్కుల సాధన కోసం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. నాయకత్వంలో ముందుకు సాగి మండలంలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని నూతన అధ్యక్షుడు సాయికుమార్ మాదిగ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా : గార్లపాటి నవీన్, ప్రధాన కార్యదర్శిగా దొంగల సృజన్, సహాయ కార్యదర్శిగా, పోతురాజు అనిల్ కుమార్, అధికార ప్రతినిధి గార్లపాటి నిఖిల్ , కోశాధికారి ఉబ్బపల్లి నరసింహారావు. , కార్యవర్గ సభ్యులు జంగం నాగరాజు, ఈ కార్యక్రమంలో కాకటి కృష్ణ, గార్లపాటి కృష్ణ, గార్లపాటి శివ కృష్ణ, బద్రి, విసనపల్లి కళ్యాణ్, నేనాలా నరేష్ బాబు, మండలంలోని ఏడు గ్రామాల ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.