ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం! – ఖమ్మం జిల్లా బీసీ యువనేతకు అవకాశం దక్కే ఛాన్స్..!? – రంగంలోకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర రాజనర్సింహ
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* రాష్ట్రంలో రానున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును తీవ్రం చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు వడపోత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు అభ్యర్థుల పరిశీలన బాధ్యతలను భుజానెత్తుకున్నట్లు రాజకీయ వర్గాల్లో...