– గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన రైతు భాను పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్క నాటిన కలెక్టర్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 08.2026.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.శుక్రవారం గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన రైతు భాను జిల్లా ఉద్యాన శాఖ సహకారంతో తన పొలంలో ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కను నాటి నీరు పోసి, రైతు భానుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రైతుతో మాట్లాడి ఎంత విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేపడుతున్నారని, నీటి వసతి ఎలా ఉందని, సాగుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ చేపడుతున్నట్లు, బోర్ నీటి ద్వారా సాగు చేయనున్నట్లు రైతు బదులిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం అవసరమని తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే వాణిజ్య పంట అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక సూచనలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని సూచించారు. వ్యవసాయఅధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్ సాగును మరింత ప్రోత్సహించాలని ఆదేశించారు.అలాగే ఆయిల్‌పామ్ సాగు చేపట్టిన రైతు భానును అభినందించిన కలెక్టర్, తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ ఆయిల్‌పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మరింత మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు అడుగులు వేయేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లే రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, బీవీజీ రామ్‌జీ పథకం కింద వ్యవసాయ రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని సంబంధిత ఎంపీడీవోను ఆదేశించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.డీ వై ఎస్ ఓ సుధీర్ రెడ్డి, డీ హెచ్ ఎస్ ఓ విజయ్ భాస్కర్, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్ లోకా రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



