POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 4:52 pm Posted by : POLITICAL POWER

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలి 

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 27. 2026.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో రైతులకు 100 శాతంసబ్సిడీతోవేరుశనగవిత్తనాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి  పంపిణీ చేశారు.వేరుశనగ విత్తనాల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తోందని తెలిపారు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని సూచించారు.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపాలనికోరారు.అనంతరం కొత్తకోట పట్టణంలో వరి కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి, కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461 కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు500రూపాయలబోనస్,పొందాలన్నారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.తదనంతరం కొత్తకోట చౌరస్తాలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఈ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలనిసూచించారు.పట్టభద్రులందరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హులైన పట్టాభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, మదనాపురం మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, వనపర్తి జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి పి జె. బాబు, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగరపు బీచ్ పల్లి యాదవ్, పట్టణ అధ్యక్షులు దేశీపెంటన్న యాదవ్  , కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్ జే . బోయజ్,సుధా రామ్మోహన్ రెడ్డి, జె .అఖిల తండ్రి జె.సుభాష్, ఎం.సంజీవులు, బీమా చంద్రకాంత్, జి.మురళి కోఆప్షన్ సభ్యులు తయ్యబ్, హఫీస్, కొండ రెడ్డి , కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్లు రాచల తిరుపతి,శంకర్ అయ్యా, మాజీ కో ఆప్షన్ సభ్యులు జే యం. మీషేక్, జిల్లా నాయకులు సలీం ఖాన్, బాదం వెంకటేష్,వివిదగ్రామాలసర్పంచులుమాసన్న,అర్జన్,ముస్తఫా, రామచంద్రయ్య, కిరణ్, రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చర్లపల్లి  శేఖర్ రెడ్డి, రావుల కరుణాకర్ రెడ్డి, జెసిబి రాములు,  ఉమామహేశ్వర్ రెడ్డి, సంద వెంకటేష్, నరేందర్ సాగర్,మన్నెం, ముజీబ్,వనపర్తి కృష్ణారెడ్డి, శివరాములు, సాయి రెడ్డి, జే ఆర్. కృష్ణయ్య, దొట్ల మన్నెం,సాయిల్ యాదవ్, శేఖర్, వెంకటేష్, శంకర్ యాదవ్, ప్రసాద్, యూత్ నాయకులు నవీన్ రెడ్డి, సాయినాథ్, దిలీప్ రెడ్డి, సోషల్ మీడియా కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్ తదితరులు   పాల్గొన్నారు.