POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 3:58 pm Posted by : POLITICAL POWER

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర… రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బి గోపాల్ రావు కొణిజర్ల జులై 23: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీ ఎల్లన్నగర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా సీసీ రోడ్లు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో నిత్యం అవస్థలు పడుతున్న ప్రజల సమస్యను గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి – నరసింహారావు గుర్తించి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజల సమస్యను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఎల్లన్నగర్ గ్రామానికి రూ.15 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేశారు. మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి – నరసింహారావు, ఉప సర్పంచ్ యుగంధర్, వార్డు సభ్యులు మహమ్మద్ సైదల్లి, లాల్ సింగ్, గ్రామ పెద్దలు సోములు మరియు గ్రామస్తులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌కు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.