POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:14 pm Posted by : POLITICAL POWER

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి పంటకు పోకుండా పంట మార్పిడి విధానాలను అనుసరించేలా ప్రోత్సహించాలి

– ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో  యస్.ఈశ్వర్.ఆగస్టు08.2026.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలు పాటించి, వరి పంటకు పోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల సాగు, వన మహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సహచర మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి హాజరయ్యారు.వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అవసరమైన అన్నిఏర్పాట్లుపూర్తిచేయాలనిఆదేశించారు.నీటివనరులనుఅవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా వినియోగించుకోవడంతో పాటు తాగునీటిసమస్యలు తలెత్తకుండాచర్యలుతీసుకోవాలనిసూచించారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలు పాటించేలా వ్యవసాయ అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, భూగర్భ జలాల సంరక్షణకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించి రైతులకు ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి వివరాలు, సాగు ప్రణాళికలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాటిన మొక్కల జియో ట్యాగింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. పంటల సాగు,వర్షపాతం,నీటిలభ్యతపైసమీక్షనిర్వహించారు.అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్మార్ట్ రేషన్,కార్డులపంపిణీకార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, గ్రామ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహనకల్పించేందుకుసిద్ధంకావాలనిసంబంధితఅధికారులనుఆదేశించారు.ఈసమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, సిపిఓ హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఎస్ ఈ చంద్రశేఖర్, ఇతర జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.