
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
ఎల్‌నినో ప్రభావిత,హైరిస్క్ ప్రాంతాల్లో రైతులకు సాగునీటి పొదుపు, పంటల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సిరిగిరెడ్డి మురళీమోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు.వేముల మండలంలోని నల్లచెరువుపల్లి,కొండ్రెడ్డిపల్లి,నారేపల్లి తదితర గ్రామాలతో పాటు తొండూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం పర్యటించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని వివిధ పంట పొలాలను పరిశీలించిన ఆయన,ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా సూక్ష్మ సేద్యం,డ్రిప్ పరికరాల వినియోగం ద్వారా తక్కువ నీటితో పంటలకు అవసరమైన తేమను అందించవచ్చని వివరించారు.డ్రిప్ పరికరాల పనితీరు,వినియోగ విధానం,పంటలకు కలిగే ప్రయోజనాలపై రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.డ్రిప్ పరికరాలు అవసరమైన రైతులను గుర్తించి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి,వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు.అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశాల్లో మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావిత, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రైతులు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.డ్రిప్ పద్ధతిలో నీటిని నేరుగా మొక్కల వేర్లకు అందించడం వల్ల నీటి వృథా తగ్గడంతో పాటు పంటలకు సమర్థవంతంగా నీరు అందుతుందని తెలిపారు.రైతులు సూక్ష్మ సేద్య పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో ఏపీఎంఐపీ సిబ్బంది నాగేష్,సంబంధిత అధికారులు,రైతులు పాల్గొన్నారు.

