పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాల్గోనాలో హెడ్ నర్స్ చీఫ్ ఇవాంజెలిన్ పదవీ విరమణ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడాడు
ఎంతోమంది రోగులకు అమ్మలా సేవ చేసిన హెడ్ నర్స్ చీఫ్ ఎవెంజెలిన్
40 సంవత్సరాల పాటు ఆసుపత్రికి వెన్నుదన్నుగా నిలిచిన అందిన్‌చిన్నా సేవలు మరువలేనివి. రాత్రి పగలు తేడా లేకుండా రోగుల సంరక్షణ కోసం వారు చేసిన కృషి అమూల్యం. ప్రతి రోగికి చిరునవ్వుతో ధైర్యం చెప్పిన మీ మాటలు ఈరోజు కూడా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒక నర్సు గా మాత్రమే కాదు, ఒక తల్లిగా, ఒక గురువుగా మీరు ఎంతో నేర్పించారు. మీ క్రమశిక్షణ, అంకితభావం, మానవత్వం జూనియర్ నర్సులకు ఎప్పటికీ ఆదర్శంఅన్నారు. కష్టమైన సమయాల్లో కూడా చిరునవ్వు చెదరనివ్వకుండా విధులు నిర్వర్తించారు ఎవాంజెలిన్ అన్నారు. జూనియర్ నర్సుల అందరికీ మీరే స్ఫూర్తి. మీ నుండి నేర్చుకున్న పాఠాలు జీవితాంతం వెంట ఉంటాయి. ఇది మీ కష్టానికి దొరికిన గౌరవం. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది. ఇకపై కుటుంబంతో ఆనందంగా గడపాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు. యు ఇవాంజెలిన్ 40 సంవత్సరాలు ప్రజాసేవలో తమ జీవితాన్ని గడిపి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి – వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలస శంకర్ గౌడ్, డా. బండారు శ్రీనివాస్, సామాజికవేత్త గంధం నాగరాజు పాల్గొని శాలువా మరియు జ్ఞాపకతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమోహన్, ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ బంగారయ్య, డాక్టర్ కిరణ్మయి డాక్టర్ రెడ్డి కుమారి డాక్టర్ జావిద్, విజయేందర్ రెడ్డి రాజశేఖర్, సద్దాం, బిక్షపతి, రజనీ దేవి, గౌరీ దేవి భాగ్యలక్ష్మి దైవకృప మరియు తదితరులు పాల్గొన్నారు.