POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:35 pm Posted by : POLITICAL POWER

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: పెద్దమందడి మండలంలోని గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను బీజేపీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు లక్ష్మి, పుష్పలత, గ్రామ అధికారి వెంకటస్వామి, మండల అధికారి కర్ణంను కలిసి ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ఫారాల ఆన్‌లైన్ నమోదు ఎంత శాతం పూర్తయిందో, గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ఉందో, ఇంకా పూర్తి చేయాల్సిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్హ ఓటరు వివరాలు నమోదు అయ్యేలా, ఎవరూ ఇబ్బంది పడకుండా, ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా అత్యంత జాగ్రత్తగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, సమయానికి నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, నాయకులు రమేష్, తిరుపతయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.