POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 3:07 pm Posted by : POLITICAL POWER

ఎస్ఐఆర్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

– విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎల్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 17. 2026.
వనపర్తి మండలంలోని చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ గురువారం పర్యటించారు.ఈసందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలోఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలోపరిశీలించారు.అనంతరంచిన్నగుంటపల్లిప్రాథమికోన్నతపాఠశాలనుఆకస్మికంగాతనిఖీ చేశారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్  మాట్లాడుతూబూత్,లేవల్అధికారులు,బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి,పూర్తిచేసినఫారాలనుత్వరితగతినసేకరించాలనిఆదేశించారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు నింపడంలో ప్రజలకు ఎదురయ్యే సందేహాలను బీఎల్‌ఓలు నివృత్తి చేసి, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలనుపూర్తిచేసేందుకుగ్రామపంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలోనిరంతరంపర్యవేక్షణచేపట్టాలనిఆదేశించారు.అనంతరంచిమనగుంటపల్లిప్రాథమికోన్నతపాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలుపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.