POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:57 am Posted by : POLITICAL POWER

ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలపై కొత్త ఛార్జీలు

నెలలో నాలుగు లావాదేవీలకే ఉచిత పరిమితి.. ఆపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.15 + జీఎస్టీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 20 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు కీలక మార్పులు చేయనుంది. ఈ ఖాతాల ద్వారా నగదు ఉపసంహరణలు, ఇతర లావాదేవీలపై కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్‌డ్రా/ట్రాన్సాక్షన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి అదనపు లావాదేవీపై రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కేవలం బ్యాంకు శాఖల ద్వారా చేసే లావాదేవీలకే కాకుండా ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తించనున్నట్లు పేర్కొంది. కొత్త ఛార్జీల విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించినట్లు సమాచారం. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు తమ నెలవారీ లావాదేవీల పరిమితిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.