సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం లోని తెల్లపాడు గ్రామపంచాయతీని గౌరవ మండలపరిషత్ అభివృద్ధి అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత (SWPC) షెడ్ యందు నాణ్యమైన వర్మీ ఉత్పత్తి లో భాగంగా వర్మీ బెడ్ ప్రిపరేషన్ చేయించి, బెడ్ ను మొదటి దశ కంపోస్ట్ ఎరువుతో నింపి వానపాములు వదలటం వల్ల రైతులకు వర్మి కంపోస్టు ఎరువును తయారు చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరo దూలంవారి పల్లి గ్రామం లో ఇంటింటిని సందర్శించి ప్రజలకు బిన్ -బ్యాగ్ విధానం పై మరియు ఇంటిలో ఉత్పత్తి అయ్యే చెత్త తడిచెత్త, పొడిచెత్త, శానిటేరీ వ్యర్థాలు, ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యంగ పొడిచెత్త ను బ్యాగ్ లో ఉంచి, మీ గ్రామం కు వచ్చే స్వచ్ఛ రథం కు ఇచ్చి వాటి విలువకు సరిపడా కుటుంబ సరుకులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం
శానిటేషన్ IVRS కాల్స్ పై మరియు స్వచ్ఛరథం IVRS కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది .
అక్టోబర్ నెల యందు ప్రతి గ్రామపంచాయతీ కనీసం 1000 KG లు వర్మీ ఉత్పత్తి చేయుటకు చర్యలు చేపట్టాలని పంచాయతీ అభివృద్ధి అధికారిని ఆదేశించడం జరిగింది .
గ్రామం యందు ప్రజలు అందరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామపంచాయతీ ని స్వచ్ఛమైన మరియు సుందరమైన గ్రామం గా తీర్చి దిద్దుటకు సహకరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాశయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.