ఏజెన్సీ విద్యపై ఐటీడీఏ నిర్లక్ష్యం
ఉపాధ్యాయుల కొరతతో ఆదివాసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం: పాయం సత్యనారాయణ పొలిటికల్ పవర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 29: ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు. ఆదివాసీ విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి...