ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సెప్టెంబర్ 25 2026: హుకుంపేట,:మారుమూల గిరిజన గ్రామమైన హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ పరిధిలోని ఎగమాలపాడు గ్రామానికి ఎట్టకేలకు రహదారి సౌకర్యం కలగనుంది. గ్రామస్తులు సొంతంగా మట్టి, రాళ్లతో నిర్మించుకున్న సుమారు రెండు కిలోమీటర్ల దారి ఇప్పుడు రూ.263.50 లక్షల అంచనా వ్యయంతో తారు రోడ్డుగా అభివృద్ధి కానుంది. రోడ్డు కోసం గ్రామస్తులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఏడాది కాలంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2026 జనవరి 15న...