ఐఐటీ -జెఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 356వ ర్యాంక్ సాధించిన గురుకుల విద్యార్థి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ -జెఈఈ మెయిన్స్ పరీక్షలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల విద్యార్థి ఇస్లావత్ యశ్వంత్ ఆల్ ఇండియా 356వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. ఈ విషయాన్ని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాదర్ జైలాని ఒక ప్రకటనలో తెలిపారు. బల్మూరు మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఇస్లావత్ సక్రు, ఉమా దంపతుల కుమారుడు యశ్వంత్...