Date of Publish : 18 September 2026, 5:53 pmPosted by : POLITICAL POWER
ఐక్యతను చాటే పండుగ వినాయక చవితి
అన్నదానం చేయడం అభినందనీయం: పలుస శంకర్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026:వనపర్తి పట్టణంలోని మణికంఠ కాలనీలో వినాయక చవితి సందర్భంగా కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… వినాయక పండుగ భారతీయులను ఐక్యం చేసిన పండుగ అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాల గంగాధర్ తిలక్ వినాయక మండపాలను ప్రజా వేదికలుగా మలిచి, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించారని గుర్తు చేశారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒకే చోట చేరి ప్రసాదాన్ని స్వీకరించడం మన సామాజిక ఐక్యతకు ప్రతీక అని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. “అన్నదాత సుఖీభవ” అని, అన్నదానం చేసే వారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశీ రాములు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మద్దిలేటి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శివకుమార్, జగదీశ్వర్ రెడ్డి, గోపాల్, కేశవులు, బీసీ రెడ్డి, నాగరాజ్, మైత్రి, శైలజ, నరేష్, రమేష్, రాజేంద్ర ప్రసాద్ చారి, స్వప్న, హేమలత, పుష్పలత, కళ్యాణి తదితరులతో పాటు స్థానిక భక్తులు, కాలనీ వాసులు, సాహితీ కళా వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.