POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 1:41 pm Posted by : POLITICAL POWER

కనిమెట్టలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం

నీలం మదు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 8 2026: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ముదిరాజు జాతి రత్న, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ముదిరాజ్ యువత ఆదేశాల మేరకు పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తమవంతు సహకారం అందించాలని కనిమెట్ట గ్రామ యువత కోరగా, వారి విజ్ఞప్తికి స్పందించిన నీలం మధు ముదిరాజు శుక్రవారం విగ్రహ ఏర్పాటు కోసం రూ.1,00,000/- విరాళాన్ని అందించారు. ముదిరాజు సమాజానికి చెందిన యువత చేపడుతున్న కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బాలరాజ్, నరుకుల యాదగిరి, మాజీ సర్పంచ్ గాదం రాణి పరమేశు, కే. నాగేశ్వర్ రెడ్డి, బోయ వెంకటయ్య, సాయిల్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన నీలం మధు ముదిరాజుకు కనిమెట్ట గ్రామ ముదిరాజ్ యువత, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.