Date of Publish : 22 June 2026, 6:36 pmPosted by : POLITICAL POWER
కబ్జా చేసిన వారి నుండి మా భూమిని కాపాడండి
– తహసీల్దార్ కు వినతిపత్రంఅందజేసి బోరున విలపించిన గిరిజనులు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 22.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటేల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 196, 197 లో నాటేల్లి తండాకు చెందిన పట్టాదారులు నారమ్మ, మంగ్యా నాయక్, నార్య నాయక్, బాలు నాయక్, సెన్యా నాయక్ లు కలిసి మా భూమిని హైదరాబాద్ కు చెందిన ఉన్నత ఉద్యోగి రాములు అనే వ్యక్తి కబ్జా చేశారని సోమవారం తహసీల్దార్ సుభాష్ నాయుడు కు వినతిపత్రం అందజేశారు. కబ్జా చేసిన వ్యక్తికీ 196 సర్వే నంబర్ లో రికార్డుల పరంగా 4ఎకరాల 22 గుంటల భూమి ఉంది. కానీ అదనంగా ఇప్పుడు ఆయనకు 7 ఎకరాల భూమి ఉందని చెప్పారు. అయన భూమి ఆయనకు పోను మిగులు భూమి మాదేనని మాకు తెలియకుండా అయన బలాన్ని ప్రదర్శించి మా భూమిని కబ్జా చేశారని తెలిపారు. అయన ఉన్నత ఉద్యోగి కాబట్టి అడగడానికి వెళ్తే మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని తహసీల్దార్ ముందు తమ గోడును వెళ్ళబుచ్చారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని మా భూమిని అడగడానికి వెళ్తే మాపై దాడులు జరుపుతున్నారని తెలిపారు. ఇటీవల కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్లామని గుర్తు చేశారు. నాటేల్లిలో ఉన్న ఒకరిద్దరు రాములు అనే వ్యక్తికీ పరోక్ష సహకారం అందిస్తున్నారని ఎక్కడికి వెళ్లిన మాకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, ఆర్థిక బలం అడ్డుపెట్టుకొని మా భూమిని దొంగ డాక్యుమెంట్ల సాయంతో రిజిస్టర్ చేసుకున్నాడని చెప్పారు. మీరు మొఖపైకి వచ్చి 196, 197 సర్వే నంబర్లు పూర్తిగా సర్వే చేసి రికార్డ్ పరంగా ఎవరి భూములు ఎంత ఉన్నాయో పరిశీలించి న్యాయపరమైన నిర్ణయం తీసుకోని మాకు న్యాయం చెయాలనీ తహసీల్దార్ ను వారు కోరారు.