మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర సర్కిల్ జవహర్ నగర్ లాల్ భాగ్ లో గల ప్రభుత్వ భూమిలో సుమారు అర ఎకరా స్థలంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కు సిసి రోడ్డు నిర్మాణం వ్యవహారం దుమారం రేపుతోంది. జవహర్ నగర్ ప్రాంతం గ్రామపంచాయతీ నుండి నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా గుర్తింపు పొందినప్పటికీ, గత 30, 35, సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న స్థానికులు తమ నివాసాల ముందు అడుగు లోతు గుంతలతో, వర్షాకాలం లో బురద తో కూడిన గతుకు మట్టిరోడ్లతో నిరుపేదలు సతమతమవుతుంటే, ధనం దాచుకునేందుకు తావులేక పదవులను పలుకుబడిని అడ్డుపెట్టుకొని సుమారు రెండువేల పైచిలుకు గజాల ప్రభుత్వ భూమిలో జలకలాడడం కోసం అక్రమ మార్గంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టి, నేడు కార్లు వెళ్లేందు కోసం సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నప్పటికీ, అటు వైపు కన్నెత్తి చూడని మున్సిపాలిటీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు సుమారు 60, 80 గజాల్లో 10/12, 12/12 చిన్న చిన్న రేకులతో గదులు నిర్మించుకున్న వాటిని జె.సి.బి.లతో అక్రమ నిర్మాణాలని కూల్చే అధికారులు ఈ అక్రమ సీసీ రోడ్ గురించి నిమ్మకు నేరేత్తకుండా ఉన్న చందంగా ఉండడం పై స్థానుకులు వ్యతిరేకిస్తున్న పట్టింపు లేని అధికారులు.