POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:52 pm Posted by : POLITICAL POWER

కమలాపురం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా శ్రీనివాసులు బాధ్యతలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కమలాపురం పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ… కమలాపురం పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, మహిళలు మరియు బాలలపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి కమలాపురం ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని ఎస్సై శ్రీనివాసులు కోరారు.