POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:39 pm Posted by : POLITICAL POWER

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

కాలనీలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న శ్రీ గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గణనాథుడి అపార కృపకు పాత్రులై, ఆ లంబోదరుడి దివ్య ప్రసాదాన్ని దక్కించుకున్న కాటం శిరీష పరమేశ్వర్ దంపతులకు కాలనీవాసులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. విఘ్నేశ్వరుడు మీకు సకల శుభాలు చేకూర్చాలని వినాయకుడి లడ్డూ ప్రసాదం కేవలం తీపి మాత్రమే కాదు… అది ఆ దేవుడి ఆశీస్సుల మూట. ఈ అద్భుతమైన ప్రసాదాన్ని అందుకున్న మీ ఇంట ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని కాలనీ ప్రెసిడెంట్ ప్రకాష్ గుప్తా ఆకాంక్షిచారు.

అదేవిధంగా జనరల్ సెక్రెటరీ డి.ఎస్ నాయక్ మాట్లాడుతూ విఘ్నరాజు కొలువులో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం మీ భక్తికి దక్కిన గౌరవం, మీ కుటుంబానికి లభించిన పరమ పవిత్రమైన భాగ్యం, ఆ బొజ్జ గణపయ్య ప్రసాదం మీ గడప తొక్కడం పూర్వజన్మ సుకృతం. ఆ స్వామి ఆశీస్సులతో మీ జీవితం సదా మధురంగా, విజయవంతంగా సాగాలని కోరుకున్నారు.

1.వెండి కలశం మామిడి శ్రీనివాస్ 101000
2.చిన్న లడ్డు పొన్నాల అర్జున్ సరిత 50000
3.సిరి మాల మధు 12000
4.స్వామివారి శాలువా పంచే హరికృష్ణ 5500
దక్కించుకున్నారు.

అనంతరం నిర్వహించిన శ్రీ గణపతి నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు.