పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో కమ్యూనిటీ సేనిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై పంచాయతీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మహబూబ్ బి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన శుభ్రమైన శుద్ధ సౌకర్యాలు అందించడంలో కమ్యూనిటీ సేనిటరీ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లలో నీటి సరఫరా , లైటింగ్, హ్యాండ్ వాష్ సౌకర్యం డోర్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కమ్యూనిటీ సెంటర్ కాంప్లెక్స్ ఎల్లప్పుడూ పరిశుద్ధంగా, వినియోగానికి అనుకూలంగా ఉండాలని, టాయిలెట్లను శుభ్రపరిచే సమయంలో పారిశుద్ధ కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిశుద్ధ కార్మికులు తప్పనిసరిగా పర్సనల్ ,ప్రొటెక్టివ్ ,ఎక్విప్మెంట్,(p.p.e) వాడాలన్నారు. సి.ఎస్. సి. నిర్మాణం వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు వాటిని సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు ,ఇంజనీరింగ్ సిబ్బందికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, మురళీమోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాము సచివాలయ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.