POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 6:19 pm Posted by : POLITICAL POWER

కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ విప్లవ జోహార్లుముత్యాలంపాడు గ్రామంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ సభ 

 

 

 

 

 

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ ( ఆర్సి కారంవెంకటేష్) నవంబర్ 07: ములకలపల్లి మండలం లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ ఫస్ట్ నుండి ఈరోజు వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కల్లూరి కిషోర్ మాట్లాడుతూ… జీవితం ఎంతో విలువైనదని, మనిషికి మరణం కూడా సహజమైనదని అన్నారు. తన కోసమే తాను బతికిన జీవితం సాధారణమైనదని, తన జీవితాన్ని సమాజం కోసం, ఉన్నత లక్ష్యాల కోసం, తోటి మనుషుల సంక్షేమం కోసం అంకితం చేసినవారు మహోన్నతులని పేర్కొన్నారు దోపిడీని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం జీవితాలను అర్పించిన వారు మహనీయులని, ప్రజా విముక్తి కోసం, నూతన సమాజ నిర్మాణం కోసం మరణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన వారు విప్లవ వీరులు, ఉద్యమ యోధులని కొనియాడారు. అలాంటి అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. అదేవిధంగా దేశ సంపదను, ప్రజల వనరులను విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. దేశంలోని చమురు, ఖనిజ సంపద, విమానాశ్రయాలు, రైల్వేలు, ఓడరేవులు, ఎల్ఐసీ, బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు చౌకగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాశీల మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు కల్లూరి పద్మ, ముత్యాలంపాడు గ్రామ కమిటీ సభ్యులు ఈసం శివ, ఈసం బాల తదితరులు పాల్గొన్నారు