కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ కు ఉత్తరాఖండ్ సీఎం అభినందనలు..
*సీఎం పుష్కర్ సింగ్ ధామ
ని సన్మానించిన మేయర్ కోలగాని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ను ఈ సందర్భంగా అభినందించి , శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రప్రదంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటీవల బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో, మేయర్ గా అతి పిన్న వయసు కలిగిన కోలగని శ్రీనివాస్ నియామకం కావడం పట్ల సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతోషం వ్యక్తం చేశారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అలాగే సమావేశాలకు అతిథులుగా హాజరైన ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రులు సుబోధ్ ఉన్నియాల్, ప్రేమ్ చంద్ర అగర్వాల్ , మదన్ కౌశిక్ ,లోకసభ సభ్యులు (హరిద్వార్) త్రివేంద్ర సింగ్ రావత్
రాజ్యసభ సభ్యులు
మహేంద్ర భట్, డా. ప్రేమ్ చంద్ర అగర్వాల్ (ఎమ్మెల్యే, ఋషికేశ్ నియోజకవర్గం)లను మేయర్ కోలగని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.