పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు కర్ణాటక రాష్ట్ర మంత్రి గా నాల్గవ సారి ఎన్నికయినా మన వడ్డెర ముద్దు బిడ్డ (భోవి వడ్డెర) శివరాజ్ యస్ తంగడి ని, మరియు క్యాబినెట్ హోదా కలిగిన ( భోవి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్) డాక్టర్ రామప్ప ని బెంగుళూరు లోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి బొకే, శాలువాలతో ఘనంగా సన్మానం చేసిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ మరియు జాతీయ వడ్డెర సంఘం నాయకులు
కర్ణాటక రాష్ట్ర మంత్రి గా 4 వ సారి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వడ్డెర ముద్దు బిడ్డ శివరాజ్ యస్ తంగడి ని బెంగుళూరు లోని వారి నివాసంలో కలిసి జాతీయ వడ్డెర సంఘం తరుపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం పిట్ల శ్రీధర్ మంత్రి తో మాట్లాడుతూ మన కులానికి ఈ దేశంలో ఉన్న ఏకైక మంత్రి మీరే అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ రిజర్వేషన్ లేక అన్ని విషయాలలో మేము వెనుకబడి వున్నామని, రాజకీయ పరంగా మన కులానికి ఏ సహాయం కావాలన్న మీరు సహకారం అందించాలని సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి కి చెప్పటం జరిగింది. అనంతరం మంత్రి శివరాజ్ యస్ తంగడి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మేము ఎస్సీ రిజర్వేషన్ తో ఉన్నాం కాబట్టి మాకు ఈ అవకాశాలు అందుతున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలా నుండి ప్రతి ఎలక్షన్స్ లో మనవారు ఎంపీ లుగా, ఎమ్మెల్యేలు గా, ఎంఎల్సీ లు గా, ఛైర్మెన్ లు గా ఎన్నికవుతున్నారని దీనికంతటికీ కారణం ఇక్కడ రిజర్వేషన్ తో పాటు కులానికి ఏమైనా అన్యాయం జరుగుతుంది అంటే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతం గా మేము అంతా ఒక్కటి అవుతామని అందరం కలిసి కట్టుగా ఉన్నాం కాబట్టే కర్ణాటకలో మనకు కావలసిన హక్కులు సాధించుకుంటున్నామని తెలియచేసారు. మీరు మాకు పాత మిత్రులే అని, మీకు ఎప్పడు ఏ అవసరం ఉన్నా ఏ సలహా సాకారం కావాలన్న తప్పకుండా నన్ను సంప్రదించాలి అని చెప్పటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్న తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బోధస్ రవి, జాతీయ నాయకులు జెర్పటి రాజు, గుంజ రమేష్ బాబు, గుంజ ఆంజనేయులు, కొడగంటి కృష్ణయ్య, తన్నీరు చలపతి, ఉప్పుతేల్లా దయాకర్, మల్లె నారాయణ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు…..